తాజా ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్‌ జగన్‌

నామినేషన్ల దాఖలులో అడ్డంకులు.. వైసీపీ అధినేత ఆరోపణలు

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా అడ్డంకులు ఎదురవుతున్నాయని, దీనిపై తాజా ఆధారాలతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే నామినేషన్లకు గడువు పొడిగించడం సమస్యకు పూర్తి పరిష్కారం కాదని జగన్‌ అన్నారు. రాజంపేటలోని 32 వార్డులకు గాను వైసీపీ 14 వార్డుల్లోనే పోటీ చేయగలుగుతోందని, కడపలో 66 వార్డులకు గాను 13 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుపతిలో మిగిలిన 18 వార్డులకు, మైదుకూరులో అన్ని వార్డులకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

గోరంట్ల, ధర్మవరం, వి.కోట, చిత్తూరు, జీడీ నెల్లూరు, కనిగిరి, పుంగనూరు తదితర ప్రాంతాల్లో అభ్యర్థులపై దాడులు, నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని జగన్‌ ఆరోపించారు. ఈ అంశాలపై గవర్నర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించినట్లు చెప్పారు. వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితాతో పాటు ఏ, బీ ఫారాలను పరిశీలించి, అర్హులైన అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ తప్పుగా ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపించగా, ఎన్నికల సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలకు ప్రతిపక్షం కూడా కారణమని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.

Views: 154

Related Posts

  • SuryaSurya
  • October 27, 2026
  • 630 views
66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

Read more

  • SuryaSurya
  • October 27, 2026
  • 168 views
ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌