
కనీస పోటీ ఇవ్వలేకఫోతున్న వైసీపీ
ప్రచారంలో దూసుకుపోతున్న వల్లభనేని రాజేశ్వరి
మెజార్టీపైనే గురి …
అమరావతి టుడే ప్రతినిధి:
65వ డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గత ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన వల్లభనేని రాజేశ్వరికి టీడీపీ అధిష్టానం మరోమారు కార్పొరేటర్ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చింది. దీంతో డివిజన్లో తాను చేసిన అభివృద్ధి సంక్షేమంను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
నిత్యం ప్రజలతో మమేకం
ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్ధి వల్లభనేని రాజేశ్వరి, ఆమె భర్త వల్లభనేని సతీష్ నిత్యం ప్రజలతో కలిసి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎన్నికల ప్రారంభానికి ముందునుంచే 365 రోజులు డివిజన్లో పాదయాత్ర నిర్వహించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ గడపకు వెళ్లి పేరుతో పలకరించే చనవు పరిచయాలు వల్లభనేని సతీష్ స్వంతం. అతి సింపుల్గా డివిజన్« అధ్యక్షుడు తోట పాండుతో కలిసి ఎటువంటి ఆర్బాటం లేకుండా పాదయాత్ర చేయటం గమనార్హం
వైసీపీ బేజారు
ఇక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పసుపులేటి లక్ష్మీ అధికార పార్టీ అభ్యర్ధికి కనీస పోటీ సైతం ఇవ్వలేకపోతున్నారు. వైసీపీ క్యాడర్ బలహీనంగా ఉండటంతో పాటు టీడీపీ అభ్యర్ధి బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో పోటీ నామమాత్రంగా మారింది. ఏదో నామినేషన్ వేశాం కాబట్టి ప్రచారం చేయాలని చేయటం తప్ప గెలవాలనే తపనతో మాత్రం పోటీ జరగటం లేదు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి అంగిరేకుల గొల్లభామ టీడీపీ అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు కనీసం పోటీలేకుండా ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుంది.
Views: 672






