చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి


బీఆర్టీఎస్‌ రోడ్డులో ’పోలియో అవేర్‌నెస్‌ వాకథాన్‌ 2026’
అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :
ప్రతీ చిన్నారికీ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించి దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్‌ డీసీపీ సురక్షితంగా ఉంచాలనిఎస్‌.కె. షరీన్‌ బేగం అన్నారు. స్ధానిక బీఆర్టీఎస్‌ రోడ్డులో శనివారం ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మిడ్‌టౌన్‌ సహకారంతో బీఆర్టీఎస్‌ రోడ్డులో శనివారం ’పోలియో అవేర్‌నెస్‌ వాకథాన్‌ 2026’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని రోటరీ డిస్ట్రిక్ట్‌ 3020 గవర్నర్‌ రోటరియన్‌ గుత్తికొండ శ్రీరామ్‌తో కలిసి వాక్‌ధాన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం నుండి పోలియోను పూర్తిగా పారద్రోలడానికి రోటరీ ఇంటర్నేషనల్‌ చేస్తున్న కృషిని కొనియాడారు. ఎండ్‌ పోలియో నౌ’ అనే నినాదంతో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, భవిష్యత్‌ తరాలను సురక్షితంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో గతంలో కరోనాపై ఎలా విజయం సాధించామో, అదే రీతిలో పోలియో రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో రోటరీ కృషి ఎంతగానో ఉందని ప్రశంసించారు. విశిష్ట అతిథిగా ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఏ. శ్రవణ్‌ బాబ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, గ్లోబల్‌ పోలియో ఎరాడికేషన్‌ ఇనిషియేటివ్‌ వంటి సంస్థల విశేష కృషితో భారతదేశంలో 2011 నుండి నేటి వరకు ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ , ఇంజెక్టెడ్‌ పోలియో వ్యాక్సిన్‌లను పల్స్‌ పోలియో కార్యక్రమం ద్వారా విజయవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఐదేళ్ళలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించటం తల్లితండ్రులు బా«ధ్యతగా గుర్తించాలని అన్నారు, కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ప్రెసిడెంట్‌ రవిప్రకాష్‌ సోమయాజుల, సెక్రటరీ రామకృష్ణ ఉప్పలపాటి, యడ్ల పార్థసారథి, వెంకట్‌ కేతిబోయిన, త్రినాథ్‌ నండూరి తదితరులు పాల్గొని మాట్లాడారు.

Views: 280

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌