దడ పుట్టిస్తున్న స్వతంత్య్ర అభ్యర్ధి


69వ డివిజన్‌లో కీలకంగా మారిన స్వతంత్య్ర అభ్యర్ధి
అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టిస్తున్న బ్యాట్‌
అమరావతి టుడే ప్రతినిధి:
69వ డివిజన్‌ నగరపాలకసంస్ధ ఎన్నికలలో స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంద్రనాద్‌(బాబీ) అధికార, ప్రతిపక్ష పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. టీడీపీ పార్టీకు చెందిన మహేంద్రనా«ద్‌ (బాబీ) టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే ఇక్కడ సీటు పొత్తులలో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన స్వతంత్య్ర అభ్యర్ధిగా బ్యాటు గుర్తుపై పోటీ చేస్తున్నారు. అధికార జనసేన అభ్యర్ధి అడబాల కృష్ణాజీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కమ్మిలి రత్నకుమార్‌లకు ధీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ కార్యాలయంను సైతం ఏర్పాటు చేసి ప్రచారంలో ముందంజ వేశారు..
అండగా నిలిచిన టీడీపీ క్యాడర్‌
స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న కె మహేంద్రనా«ద్‌(బాబీ)కు అధికార పార్టీకు చెందిన టీడీపీ క్యాడర్‌ అండగా నిలిచింది. బాబీ కోసం ఎంతో కాలంగా టీడీపీలో పనిచేస్తున్న టీడీపీ నేతలు పార్టీకి సైతం రాజీనామా చేసి బాబీ వెనుక ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు బాబీకు మద్దతుగా నిలవటంతో పాటు ఆయనకోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాగైనా డివిజన్‌లో గెలవాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తలపట్టుకుంటున్న అధికార పార్టీ అభ్యర్ధి
ఇక్కడ జనసేన అభ్యర్ధిగా పోటీచేస్తున్న అభ్యర్ధి తనకు సహకరించాల్సిన టీడీపీ నేతలు స్వతంత్య్ర అభ్యర్ధికి మద్దతు ఇవ్వటంతో పాటు జోరుగా ప్రచారం చేయటంతో తలపట్టుకుంటున్నారు. టీడీపీ ఓట్లు చీలిపోవటం వల్ల తమ అభ్యర్ధి విజయం ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార , ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహించటంతో పాటు ప్రజలతో ఉన్న సంబంధాలు, స్ధానికతతో బాబీ ఖచ్చితంగా గెలుస్తారని స్ధానికులు అంటున్నారు.
త్రిముఖ పోటీ
నగరంలో ప్రతీ చోటా అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాత్రమే పోరు జరుగుతుండగా ఇక్కడ మాత్రం త్రిముఖ పోరు జరుగుతుంది. స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న మహేంద్రనాద్‌ (బాబీ) అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను ఆకర్షించటంతో పాటు ప్రచారంలో మందంజ వేశారు. డివిజన్‌లో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా స్వతంత్య్ర అభ్యర్ధి బ్యాటు గుర్తు ముందంజలో ఉందని పలువురు చెబుతున్నారు.
ఒక అవకాశం ఇవ్వండి
టీడీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ క్రమంలో ఎంతో ఖర్చు చేశాం. ఎన్నికలలో తమ పార్టీ టికెట్‌ ఇస్తుందని ఆశించి భంగపడ్డాం. ప్రజల ఆశీస్సులు, వారి సూచనల మేరకు స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాను. నా కోసం ఎంతో మంది పార్టీలకు సైతం రాజీనామా చేసి నా వెనుక నిలబడటం ఆనందంగా ఉంది. ప్రజల సహకారంతో ఖచ్చితంగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంద్రనాద్‌ (బాబీ) ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Views: 5068

  • Related Posts

    • SuryaSurya
    • October 29, 2026
    • 14 views
    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    నగర అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని …

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.