సుహాసినిల చీరలు ఏమయ్యాయి ?

పట్టించుకోని పూజల సెక్షన్ సూపర్నెంట్.

అర్చకులు చేతి వాటంపై అనుమానాలు.

ఏడాది కోమారు అందే వస్త్ర ప్రసాదం దక్కకపోవడంపై సుహాసినిల మనోవేదన.

అమరావతి టుడే ప్రతినిధి:

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సుహాసిని, కుమారి పూజలు నిర్వహించడం దేవస్థానంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా అదే పద్ధతిలో సుహాసిని కుమారి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా సుహాసినిలకు పూజ అనంతరం ఇచ్చే వస్త్రప్రసాదం అందించకపోవడం తో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ పూజల కోసం వివిధ ప్రాంతాల నుంచి బ్రాహ్మణ ముత్తైదువులు వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు చీర ప్రసాదం అందకపోవడం పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ చీరలు ఏమయ్యాయి ?

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కుమారి సుహాసిని లకు ఇచ్చే చీరలను ప్రత్యేకంగా ముందుగానే సిద్ధం చేయటం ఆనవాయితీగా వస్తుంది . అయితే ఈ ఏడాది మంగళ బుధవారాలలో చీరలు లేవని, కేవలం జాకెట్ ముక్కలను ఇచ్చి ఇదే అమ్మవారి ప్రసాదం గా భావించమని అర్చకులు చెప్పటం విశేషం . ప్రతి ఏడాది సంప్రదాయంగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా చీరల అందించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ పూజలు ప్రస్తుతం తూతూ మంత్రంగా చేసి మమ అనిపిస్తున్నారు.. సుహాసినిలకు, కుమారిలకు ఇచ్చే ప్రసాదాల్లో కూడా భారీగా కోతలు విధించి మిగిలినవి పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ అధికారి పట్టించుకోరా?

పూజల కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామని ప్రకటనలు గుప్పించిన అధికారులు నిర్వహణలో మాత్రం సక్రమంగా చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూజలలో పాల్గొనే ఉభయ దాతలు, సుహాసినిలు, కుమారీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత సెక్షన్ సూపర్నెంట్ పై ఉన్న, ఆమె పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఆ చీరలు అందేనా?

రెండు రోజులపాటు సుమారు 40 మంది సుహాసినిలకు చీరలు దక్కలేదు అయితే ఆ చీరలు వారికి తర్వాత అయినా ఇస్తారా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి సుహాసిని కి సంబంధించిన పేరు, ఫోన్ నెంబర్లు అధికారుల దగ్గర ఉన్నప్పటికీ వారికి అందజేసే ప్రయత్నాలు జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ బాధ్యతలను నిర్వహించే అర్చక ఇంచార్జ్ కూడా పట్టించుకోకపోవడంతో సుహాసినిలు మధన పడాల్సి వచ్చింది. తర్వాత అయినా అమ్మవారి చీర ప్రసాదం తమకు అందుతుందన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.

పక్క దారి పట్టాయా?

సుమారు 40 మందికి దక్కాల్సిన చీరలు మాయం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ చీరలు అధికారులు, ఇన్చార్జి అర్చకులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. అర్చకుల సతీమణులు పూజలో కూర్చుంటే మాత్రం వారికి అధిక ధర కలిగిన చీరలు అందిస్తూ, ఇతర బ్రాహ్మణ సుహాసినిలకు మాత్రం అతి తక్కువ ధరల చీరలను అందించి వ్యత్యాసం చూపిస్తున్నారన్న వాదనలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ 40 మందికి దక్కాల్సిన చీరల లెక్కల వ్యవహారం అధికారులు బయటపెడతారో, లేదా కిమ్మనకుండా ఊరుకుంటారో వేచి చూడాల్సిందే.

Views: 196

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌