విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా కెంబూరి కృష్ణ
అమరావతి టుడే ప్రతినిధి:
మధురానగర్కుచెందిన జనసేన 29వ డివిజన్ ఇంఛార్జి కెంబూరి కృష్ణ విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీ పటిష్టతకు కెంబూరి కృష్ణ కృషి చేస్తున్నారు. గత ఎన్నికలలో జనసేన అభ్యర్ధిగా ఆయన భార్య కెంబూరి భవాని పోటీ చేసి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి ఓటింగ్ సాధించారు. పార్టీ ఆదేశించిన ఆదేశాలను తూచ తప్పకుండా ఆచరించటంతో పాటుక్రమశిక్షణ కలిగిన జససైనికుడు కెంబూరి కృష్ణ. ఆయన అందిస్తున్న సేవలు గుర్తించిన పార్టీ విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో సైతం ఆయనకే కార్పొరేటర్ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్వాహక దళ్ సభ్యురాలిగా కెంబూరి భవాని
గత ఎన్నికలలో జనసేన కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీ చేసిన కెంబూరి భవాని ను జనసేన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్వాహక దళ్ సభ్యురాలిగా నియమించారు. ఈ మేరకు పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేన నాయకులు కెంబూరి కృష్ణ, భవానీలకు అభినందనలు తెలిపారు.
Views: 1176







