![]()
ప్రారంభమయ్యిన నామినేషన్ల పర్వం
తొలిరోజు నామినేషన్ వేసిన ఒగ్గు సుజాత
అమరావతి టుడేప్రతినిధి:
నగరంలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమయ్యింది. శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు మూలానక్షత్రం కావటంతో అమ్మవారికి ఫూజలు చేసి నామినేషన్లను సమర్పించారు. తొలిరోజు ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ సతీమణి ఒగ్గు సుజాత 72వ డివిజన్ నుంచి నామినేషన్ సమర్పించారు. తొలుత డప్పువాయిద్యాలుతో ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేశారు.డివిజన్లో తనకు ఉన్న పరిచయాలు తాము చేసిన మంచి పనులు సేవ తమను గెలిపిస్తాయని ఒగ్గు గవాస్కర్ అన్నారు. ఎన్నికలలో తమ విజయం తధ్యం అని.. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా తాము ఖచ్చితంగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు… అనంతరం డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ఫ్యానుగుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్ధించారు. తమకు అవకాశం ఇస్తే ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటామని ప్రజల సమస్యల పరిస్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు.
Views: 952







