పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీవిరమణ ఒక భాగం

ఘనంగా నాగవరపు శరత్‌చంద్‌ పదవీవిరమణ

ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
అమరావతి టుడే ప్రతినిధి:
పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదని నాగవరపు శరత్‌చంద్‌ శేషజీవితం కళారంగంలోకి రావాలని ప్రముఖ కవి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. స్ధానిక ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయంలో శనివారం జూనియర్‌ మేనేజర్‌ నాగవరపు శరత్‌ చంద్‌ పదవీవిరమణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిధిగా పాల్గొని మాట్లాడారు. 42 సంవత్సరాలుగా ప్రభుత్వ ముద్రణాలయంలో వివిధ హోదాలలో ఆయన అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీవిరమణ ఒక భాగం అని అటువంటి పదవీ విరమణ ను ఒక అవకాశంగా తీసుకుని నచ్చిన రంగంలో రాణించాలని అన్నారు. ముఖ్య అతిధి ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనర్‌ కమీషనర్‌ కె వి మోహనరావు మాట్లాడుతూ శరత్‌చంద్‌ పదవీ విరమణతో ఒక నిబద్దత కలిగిన ఉద్యోగి సేవలను కోల్పోతున్నామని అన్నారు. శరత్‌చంద్‌ పదవీవిరమణకు ఇంత మంది తరలిరావటం చూస్తుంటే ఆయన చేసిన సేవలు తెలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వముద్రణాలయం డీజీఎం ఎల్‌ మోహన్‌కుమార్, పర్పల్‌ రోజ్‌ ప్రొడక్ట్స్‌ సీఇఓ డాక్టర్‌ గోసాల మురళీకృష్ణ, ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ పీ చంద్రశేఖర్,డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వెలగా జోషి, ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా డీఆర్‌ఓ పీ వీ ర మణ. ఎన్టీఆర్‌జిల్లా పెన్షనర్స్‌ అసొసియోషన్‌ అధ్యక్షులు జీ నారాయణరావు, రిటైర్డ్‌ ఆలిండియా రేడియో సీనియర్‌ అనౌన్సర్‌ డాక్టర్‌ బీ జయప్రకాష్, ప్రముఖ పారిశ్రామిక వేత్త జీ రామకృష్ణారావు,ఇండియాఏ టీమ్‌ క్రికెటర్‌ నెక్కంటి మధుకర్‌ ప్రభుత్వ ముద్రణాలయం సిబ్బంది తదితరులు పాల్గొని నాగవరపు శరత్‌చంద్‌ను శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు.

Views: 140

  • Related Posts

    • SuryaSurya
    • November 7, 2026
    • 168 views
    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం! క్షత్రియ కార్పొరేటర్లను సత్కరించిన క్షత్రియ సేవాసంఘం నేతలు నగర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం.. సేవాసంఘం ప్రతినిధులు పెనుమత్స అప్పలరాజు, ఉద్దరరాజు విజయరామరాజు అమరావతి టుడే ప్రతినిధి: నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో కలిసి…

    Read more

    • SuryaSurya
    • November 5, 2026
    • 1540 views
    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    నిబద్దత కలిగిన నేత తోట పాండు ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు ఘనంగా సత్కరించిన టీడీపీ, జనసేన కార్పొరేటర్‌లు అమరావతి టుడే ప్రతినిధి: నిబద్దత కలిగిన మంచి నాయకుడు తోట పాండు అని 65వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు మరోమారు పట్టం

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు  మరోమారు పట్టం

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర