మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం!
క్షత్రియ కార్పొరేటర్లను సత్కరించిన క్షత్రియ సేవాసంఘం నేతలు
నగర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం.. సేవాసంఘం ప్రతినిధులు
పెనుమత్స అప్పలరాజు,
ఉద్దరరాజు విజయరామరాజు
అమరావతి టుడే ప్రతినిధి:
నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో కలిసి తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని క్షత్రియ సేవాసంఘం అధక్ష, ప్రధాన కార్యదర్శి పెనుమత్స అప్పలరాజు, ఉద్దరరాజు విజయరామరాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాల్లో ప్రజాప్రతినిధులకు తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు నగర సమగ్ర అభివృద్ధికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు సమన్వయంతో ముందుకు సాగితే నగర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మేయర్ వంగవీటి రాధాకృష్ణతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు పిన్నంరాజు త్రిమూర్తిరాజు, గాది శ్రీనివాసరాజులను సేవాసంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ప్రజల ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులు నగర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.నగరంలో రెండు డివిజన్లలో క్షత్రియులు విజయం సాధించటం సంతోషంగా ఉందన్నారు. నగర అభివృద్దికి కులమతాలు రాజకీయాలకు అతీతంగా సహకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కెఎస్ ప్రసాదరాజు, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
Views: 168






