65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు మరోమారు పట్టం

వరుసగా రెండోసారి విజయకేతనం
2504 ఓట్ల భారీ మెజార్టీతో వల్లభనేని రాజేశ్వరి ఘన విజయం
65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు ప్రజల మరోమారు పట్టం
పట్టునిలుపుకున్న టీడీపీ.. మరోసారి బోల్తాపడ్డ వైసీపీ
డివిజన్‌లో టీడీపీ శ్రేణుల విజయోత్సవాలు
అమరావతి టుడే ప్రతినిధి:
65వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ విజయపరంపరను కొనసాగించింది. సిట్టింగ్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు. 2,504 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థిపై విజయం సాధించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. డివిజన్‌లో ప్రజల నుంచి లభించిన ఆదరణ, పార్టీ శ్రేణుల సమష్టి కృషి ఆమె విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గతంలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన సేవలు ఆమెకు మరోసారి విజయాన్ని అందించాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ ఫలితంతో 65వ డివిజన్‌లో టీడీపీ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు వైసీపీకి మరోసారి నిరాశ ఎదురైంది. భారీ మెజార్టీతో రాజేశ్వరి విజయం సాధించడంతో డివిజన్‌లో టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వరుసగా రెండోసారి ప్రజల మద్దతుతో విజయం సాధించిన వల్లభనేని రాజేశ్వరికి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

 

Views: 238

  • Related Posts

    • SuryaSurya
    • November 7, 2026
    • 168 views
    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం! క్షత్రియ కార్పొరేటర్లను సత్కరించిన క్షత్రియ సేవాసంఘం నేతలు నగర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం.. సేవాసంఘం ప్రతినిధులు పెనుమత్స అప్పలరాజు, ఉద్దరరాజు విజయరామరాజు అమరావతి టుడే ప్రతినిధి: నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో కలిసి…

    Read more

    • SuryaSurya
    • November 5, 2026
    • 1540 views
    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    నిబద్దత కలిగిన నేత తోట పాండు ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు ఘనంగా సత్కరించిన టీడీపీ, జనసేన కార్పొరేటర్‌లు అమరావతి టుడే ప్రతినిధి: నిబద్దత కలిగిన మంచి నాయకుడు తోట పాండు అని 65వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు మరోమారు పట్టం

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు  మరోమారు పట్టం

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర