నిబద్దత కలిగిన నేత తోట పాండు
ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు
ఘనంగా సత్కరించిన టీడీపీ, జనసేన కార్పొరేటర్లు
అమరావతి టుడే ప్రతినిధి:
నిబద్దత కలిగిన మంచి నాయకుడు తోట పాండు అని 65వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి సతీష్, 62వ డివిజన్ కార్పొరేటర్ సమతం రాధా హేమలత అభినందించారు. స్ధానిక మారుతీనగర్‌లో గురువారం 65వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తోట పాండు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని తోట పాండును శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహర్నిశలు పార్టీ కోసం ప్రజల కోసం శ్రమించే తోట పాండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయన పనితీరు, చేసిన సేవలు నిరుపమానం అని కొనియాడారు. కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ఆయన అందిస్తున్న సేవలు ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు. అనంతరం తోట పాండు భారీ కేక్‌ను కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 1540






