తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

భారీ మెజార్టీతో విజయం సాధించిన కూటమి అభ్యర్థి

రవీంద్ర గెలుపుతో 66వ డివిజన్‌లో కూటమి శ్రేణుల సంబరాలు

ఆదరించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మట్ల రవీంద్ర

అమరావతి టుడే ప్రతినిధి:

తొలి ప్రయత్నంలోనే ప్రజాభిమానాన్ని చూరగొంటూ 66వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి మట్ల రవీంద్ర ఘన విజయం సాధించారు. ఎన్నికల బరిలో తొలిసారి అడుగుపెట్టినప్పటికీ, ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో 66వ డివిజన్‌లో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలతో మమేకమవుతూ, డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగిన మట్ల రవీంద్రకు ఓటర్లు అండగా నిలిచారు. ఆయనపై నమ్మకం ఉంచి తమ అమూల్యమైన ఓటుతో విజయాన్ని అందించారు. తొలి ప్రయత్నంలోనే ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయోత్సవాల్లో కూటమి శ్రేణుల సందడి

మట్ల రవీంద్ర విజయం ఖరారైన వెంటనే 66వ డివిజన్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మట్ల రవీంద్ర

ఈ సందర్భంగా మట్ల రవీంద్ర మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందించిన 66వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, డివిజన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు.

తొలి అడుగులోనే ప్రజల నుంచి లభించిన ఈ అపూర్వ విజయాన్ని బాధ్యతగా భావిస్తూ, 66వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని మట్ల రవీంద్ర స్పష్టం చేశారు

Views: 350

  • Related Posts

    • SuryaSurya
    • November 7, 2026
    • 168 views
    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం! క్షత్రియ కార్పొరేటర్లను సత్కరించిన క్షత్రియ సేవాసంఘం నేతలు నగర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం.. సేవాసంఘం ప్రతినిధులు పెనుమత్స అప్పలరాజు, ఉద్దరరాజు విజయరామరాజు అమరావతి టుడే ప్రతినిధి: నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో కలిసి…

    Read more

    • SuryaSurya
    • November 5, 2026
    • 1540 views
    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    నిబద్దత కలిగిన నేత తోట పాండు ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు ఘనంగా సత్కరించిన టీడీపీ, జనసేన కార్పొరేటర్‌లు అమరావతి టుడే ప్రతినిధి: నిబద్దత కలిగిన మంచి నాయకుడు తోట పాండు అని 65వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు మరోమారు పట్టం

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు  మరోమారు పట్టం

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర