
క్రాస్ కంట్రీ 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం
అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక
క్రాస్ కంట్రీ అథ్లెట్ వినయ్ కుమార్‌కు సత్కారం
అమరావతి టుడేప్రతినిధి
మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అంyŠ సీవీఆర్ ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యాన క్రాస్ కంట్రీ అథ్లెట్ వినయ్ కుమార్ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్ధి వినయ్ కుమార్ కష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల క్రాస్ కంట్రీ పోటీలలో 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానాన్ని సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. వినయ్ కుమార్ అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలలో పాల్గొనేందుకు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న మంగళూరు విశ్వవిద్యాలయానికి వెళ్లనున్నారని తెలిపారు. కష్ణా యూనివర్సిటీ తరఫున మన కళాశాలకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ డి. యుగంధర్ మాట్లాడుతూ, పి. వినయ్ కుమార్ 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగును కేవలం 39 నిమిషాల్లో పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. క్రమశిక్షణ, నిరంతర సాధనతో భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించే సామర్థ్యం ఆయనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యాయామ విద్యా అధ్యాపకుడు డాక్టర్ మహమ్మద్ అంజాద్ అలీ, జిల్లా క్రీడా అభివద్ధి అధికారి కె. కోటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కుమార్‌ను అభినందించారు.
Views: 336







