జోరుగా ప్రచారం


పార్టీ అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తున్న స్వతంత్య్ర అభ్యర్ధి బాబీ
హోరాహోరీ పోరు
బ్యాట్‌తో అధికార, ప్రతిపక్ష అభ్యర్ధులను బౌండరీ దాటిస్తా.. బాబీ
ప్రజలతో మమేకం అవుతున్న బ్యాట్‌ గుర్తు బాబీ
అమరావతి టుడేప్రతినిధి:
69వ డివిజన్‌ స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంధ్రకుమార్‌(బాబీ) ప్రచారం జోరందుకుంది. ఆదివారం బాబీ టీడీపీకు రాజీనామా చేసిన నేతలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ప్రచారం నిర్వహించారు. బ్యాట్‌ గుర్తుకు ఓటు వేసి అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్దిచెప్పాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకునిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో జనసేన, వైఎస్సార్‌సీపీలకు ఓటమి తప్పదని తన కోసం ఎంతోకాలంగా పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్న వారు సైతం పార్టీలకు రాజీనామా చేసి తన వెంట నిలిచారని బాబీ అన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా…
తనపై నమ్మకంతో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటానని.. ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని బాబీ హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాసం ఇస్తే నాయకునిగా కాకుండా సేవకునిగా సేవ చేస్తానని అన్నారు. ఇంత మంది ప్రజల అభిమానం తనకు దేవుడు ఇచ్చిన వరంగా బావిస్తున్నానని అన్నారు.
అధికారం, ప్రలోభాలతో గెలవలేరు..
అధికార జనసేన పార్టీ అభ్యర్ధి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు ఎన్నికలలో అధికారం ప్రలోభాలతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ ప్రజాక్షేత్రంలో తాము ఖచ్చితంగా గెలుస్తామని స్వతంత్య్ర అభ్యర్ధి బాబీ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని యుక్తులు, కుయుక్తులు పన్నినప్పటికీ విజయం మాత్రం తనదేనని అంటున్నారు. డివిజన్‌లో ప్రజలు సైతం అ«త్యధిక శాతం బ్యాట్‌ బాబీ వెంటే ఉన్నారు. బ్యాట్‌ గుర్తుకు ఓటు వేసి అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులను బౌండరీ దాటించాలని బాబీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Views: 658

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌