వృద్దులకు అండగా…. వయోవృద్ధ ట్రస్ట్‌

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
వృద్దులకు అండగా…. వయోవృద్ధ ట్రస్ట్‌
19 ఏళ్ళుగా నిర్విరామ సేవలు
అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి
జీవిత చరమాంకంలో పట్టెడన్నం పెట్టాల్సిన కొడుకులు, కూతుళ్ళు పట్టించుకోకపోయినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చి వారి ఆలనా పాలనా చూడటమే కాకుండా ప్రతీ నెలా వారికి నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు వయోవృధ్ద ఛారిటబుల్‌ ట్రస్టు సభ్యులు. 2007లో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ చల్లా హరికుమార్‌ ఛైర్మన్‌గా ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులు ముత్తవరపు మురళీకష్ణ, విజయ్‌ నర్సింగ్‌ స్కూల్‌ అధినేత తట్టి అర్జునరావు , టీమ్‌ట్రేడర్స్‌ అధినేత తేజ్‌రాజ్‌ సోలంకీలతో పాటు మరో ఏడుగురు ట్రస్టీలుగా వయోవృధ్ద ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్టీలు స్వయంగా తలాకొంత సొమ్మును ట్రస్టుకు ఇవ్వటంతో పాటు దాతల సహకారంతో గత 19 సంవత్సరాలుగా వృద్దులకు సేవలు అందిస్తున్నారు. వృద్ధాప్యం శాపంగా మారకుండా వృద్దులకు మనోధైర్యం కల్పించటంతో పాటు ప్రతీ వారం ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నారు. అలాగే ప్రతీ నెలా మూడో ఆదివారం నిరుపేదలైన 125 మంది వృద్దులకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. వీరిలో ఎవరైనా చనిపోయిన పక్షంలో దహనకాండలకు సైతం ట్రస్ట్‌ ద్వారా ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. వృద్దులలో మానసిక ఉల్లాసం కలిగించేందుకు రెగ్యులర్‌గా ఆటల పోటీలు , సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. కులమతాలు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ట్రస్ట్‌ సేవలను పలువురు కొనియాడుతున్నారు. కనిపెంచిన తల్లితండ్రులనే భారంగా భావిస్తున్న నేటి రోజుల్లో నిరుపేద వృద్దులను గుర్తించి వారికి ప్రతీ నెలా నిత్యావసనర వస్తువులు అందజేయటంతో వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేయటం గమనార్హం,


శతా«ధిక వృద్దులకు సత్కారం
ప్రతీ ఏటా వృద్దుల దినోత్సవం పురస్కరించుకుని శతాధిక వృద్దులను గుర్తించి వారికి ప్రముఖుల చేతులమీదుగా పురస్కారాలు అందజేస్తున్నారు. శతాధిక వృద్దులను పదిమందిని ఒక్కచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్తూ దేవుని ఆశీర్వాదం తీసుకున్నట్లేనని ప్రతీ ఒక్కరికి దేవుని ఆశీర్వాదం అందజేయాలని తాము పనిచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వృద్దులకు చలికాలంలో రగ్గులు, స్వెట్టర్‌లు, వర్షాకాలంలో గొడుగులు, వేసవి కాలంలో చెప్పులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోనే మోడల్‌గా సేవలు అందజేస్తున్న ట్రస్ట్‌ను ఎంతో మంది స్పూర్తిగా తీసుకుని సేవలు అందజేస్తున్నారు.


సేవలు విస్తృతం
డాక్టర్‌ చల్లా హరికుమార్‌.,ట్రస్ట్‌ ఛైర్మన్‌
వయోవృధ్ద ఛారిటబుల్‌ ట్రస్టు సేవలను దాతలు, ట్రస్టీల సహకారంతో మరింత విస్తృతం చేసేందుకు కృషిచేస్తున్నాం. కప్పలదొడ్డి గ్రామంలో చేనేత వృద్దులను గుర్తించి గత11 సంవత్సరాలుగా నిత్యావసర వస్తువులు, వైద్యసేవలు అందజేస్తున్నాము. ఇప్పుడు నగరంలోని వృద్దులఇంట్లో మనం వాడకుండా వదలివేసిన దుస్తులను సేకరించి వాటిని అవసరమైన వార్కి అందజేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాము.

Views: 476

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 546 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 154 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌