అమరావతి టుడే ప్రతినిధి :
ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు శ్రీప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయంలో పాలకమండలి ఆధ్వర్యాన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పాలకమండలి అధ్యక్షులు తాన్న పూర్ణచంద్రరావు తెలిపారు. రామలింగేశ్వరపేట శ్రీప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయంలో పాలకమండలి ఆధ్వర్యాన ఆదివారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజుల పాటు రామలింగేశ్వరపేట భక్తజన కల్పవల్లి శ్రీ పర్వత వర్ధినీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. రోజుకు ఒక అలంకారంలో శ్రీ పర్వత వర్ధినీ అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటారని తెలిపారు. 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు శమీవక్షపూజ,21వ తేదీ బుధవారం మద్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ఉంచి మేళతాళాలు డప్పువాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. అలాగే సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహింనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆమె కపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో పాలక మండలి ప్రధాన కార్యదర్శి సున్నపు లక్ష్మీనరసారెడ్డి, కోశాధికారి కూచిబొట్ల పూర్ణయ్య శాస్త్రి,సహాయ కార్యదర్శి ఎం జగన్మోహన్రెడ్డి, కె కష్ణమూర్తి, ఎం దుర్గారావు, వీ సత్యనారాయణ, మేడిశెట్టి శేషగిరి, జీ వీ వీ సత్యనారాయణ, శ్రీసాయి మహిళ సేవక భక్తమండలి సభ్యులు పాల్గొన్నారు.
Views: 350







