గరగ నృత్యంలో అఖిల భారత స్ధాయి పోటీలకు ఎంపికైన శ్రీ విజ్ఞాన విహార విద్యార్థులు

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :
సత్యనారాయణపురం శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ విద్యార్థులు అద్భుతమైన గరగ నృత్య ప్రదర్శనతో అఖిల భారత స్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. గణిత విజ్ఞాన మేళా సంస్కృతి మహోత్సవంలో భాగంగా నిర్వహించిన నృత్య పోటీలలో శ్రీ విజ్ఞాన విహార పాఠశాల విద్యార్థులు గరగ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలలో విద్యార్థులు తొలుత సంకుల స్థాయిలో, అనంతరం ప్రాంతీయ స్థాయిలోనూ విజయాన్ని సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.ఆ తర్వాత జరిగిన పోటీలలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పోటీపడి విజయం సాధించి అఖిల భారత స్ధాయి పోటీలకు అర్హత సాధించారు. వరుస విజయాలతో ముందుకు సాగిన శ్రీ విజ్ఞాన విహార విద్యార్థులు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరగనున్న అఖిల భారత స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావటం పట్ల పాఠశాల ప్రెసిడెంట్‌ బీవీఎస్‌టీ సాయి హర్షం వ్యక్తం చేశారు.తమ పాఠశాల విద్యార్ధులు సాంప్రదాయ జానపద కళారూపమైన గరగ నృత్యాన్ని చక్కటి హావభావాలు, లయబద్ధమైన నృత్య కదలికలు సమన్వయంతో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. , విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు కళలు, సంస్కృతి .. సంప్రదాయాలకు పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తమవిద్యార్థులు ప్రతిభను చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి దశలోనూ విజయాన్ని సాధిస్తూ చక్కటి ప్రతిభను చాటి నూతక్కిలో ఆదివారం జరిగిన పోటీలలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడి అఖిల భారత స్థాయి వరకు చేరుకోవడం నగరానికి, పాఠశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. విద్యార్ధులు మరింత మెరుగైన ప్రదర్శనతో జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్ధులను పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్ధులు అభినందించారు.

Views: 5334

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 574 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌