11 నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :

ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు శ్రీప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయంలో పాలకమండలి ఆధ్వర్యాన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పాలకమండలి అధ్యక్షులు తాన్న పూర్ణచంద్రరావు తెలిపారు. రామలింగేశ్వరపేట శ్రీప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయంలో పాలకమండలి ఆధ్వర్యాన ఆదివారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజుల పాటు రామలింగేశ్వరపేట భక్తజన కల్పవల్లి శ్రీ పర్వత వర్ధినీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. రోజుకు ఒక అలంకారంలో శ్రీ పర్వత వర్ధినీ అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటారని తెలిపారు. 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు శమీవక్షపూజ,21వ తేదీ బుధవారం మద్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ఉంచి మేళతాళాలు డప్పువాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. అలాగే సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహింనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆమె కపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో పాలక మండలి ప్రధాన కార్యదర్శి సున్నపు లక్ష్మీనరసారెడ్డి, కోశాధికారి కూచిబొట్ల పూర్ణయ్య శాస్త్రి,సహాయ కార్యదర్శి ఎం జగన్‌మోహన్‌రెడ్డి, కె కష్ణమూర్తి, ఎం దుర్గారావు, వీ సత్యనారాయణ, మేడిశెట్టి శేషగిరి, జీ వీ వీ సత్యనారాయణ, శ్రీసాయి మహిళ సేవక భక్తమండలి సభ్యులు పాల్గొన్నారు.

Views: 350

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 602 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌