నేడు మోస్త‌రు వ‌ర్షాలు

అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అండమాన్ పరిసరప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో శుక్ర‌వారానికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులురూ ఆది,సోమవారాల్లో వాయుగుండంగా రూపాంతరం చెంది ఆ తరువాత 2-3 రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం నుంచి మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తీరానికి తిరిగిరావాలని హెచ్చరించారు. కాగా శుక్రవారం మన్యం , అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌న్నారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్ర‌ఖ‌ర్ జైన్ పేర్కొన్నారు.

Views: 70

Related Posts

  • SuryaSurya
  • October 27, 2026
  • 574 views
66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

Read more

  • SuryaSurya
  • October 27, 2026
  • 168 views
ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌