దాడులు, హత్యలు, వేధింపుల కేసుల పరిశీలనకు ప్రభుత్వం నిర్ణయం
అమరావతి టుడే ప్రతినిధి :
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపుల కేసులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం జి.ఓ. జారీ చేసింది.
జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి సిఫార్సులు చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించినట్లు ప్రకటనలో పేర్కొంది.
కమిటీలో ఎవరెవరు?
రాష్ట్ర హోంశాఖ మంత్రి చైర్మన్‌గా, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హోం, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐజీ (లా అండ్ ఆర్డర్), జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సమాచార–పౌరసంబంధాల శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జర్నలిస్టులపై దాడులు, హత్యలు, వేధింపుల ఘటనలను పరిశీలించడంతో పాటు భద్రత, సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. కమిటీ ఏర్పాటుపై జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Views: 280







