అమ‌రావ‌తి ప‌నుల్లో కార్మికుల‌ను పెంచండి

అమ‌రావ‌తి ప‌నుల్లో కార్మికుల‌ను పెంచండి

– అధికారుల‌కు ఏడీసీ సీఎండీ ల‌క్ష్మీపార్థ‌సార‌థి ఆదేశాలు

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి
రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల్లో కార్మికుల‌ను అధిక సంఖ్య‌లో స‌మ‌కూర్చి నిర్మాణ ప‌నుల‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి అధికారుల‌ను ఆదేశించారు.
ఎన్‌-9, ఎన్-11 ట్రంక్ రోడ్ల నిర్మాణాలు, ఎల్పీఎస్‌ జోన్‌-9,10,12 త‌దిత‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను బుధ‌వారం ఆమె ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ట్రంక్ రోడ్ల‌లో జ‌రుగుతున్న ముఖ‌మైన మౌలిక స‌దుపాయాలైన తాగునీరు, స్ట్రామ్ వాట‌ర్‌, ప‌వ‌ర్‌లైన్ డ‌క్టుల‌లో కార్మికుల ప‌నితీరును ప‌రిశీలించారు. నిర్ధేశించిన కార్మికుల సంఖ్య కంటే స్వ‌ల్ప తేడా ఉండ‌టంతో స‌ద‌రు గుత్తేదారు సంస్థ‌ల వ‌ద్ద కార్మికుల సంఖ్య‌ను పెంచాల‌ని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.న‌ర‌సింహ‌మూర్తిని ఆదేశించారు. అక్టోబ‌రు నుంచి మే నెల వ‌ర‌కు నిరంత‌రాయంగా ప‌నులు జ‌రిగి ప్ర‌గ‌తి క‌నిపించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
ఎన్‌-11, ఈ-1 జంక్ష‌న్‌, ఎన్‌-9 ర‌హ‌దార్ల‌లో జంక్ష‌న్ల వ‌ద్ద అభివృద్ధి ప‌నులు త‌క్ష‌ణం పూర్తిచేయాల‌ని ఆదేశించారు. ఎల్‌పీఎస్ జోన్‌-9లో అంత‌ర్గ‌త ర‌హ‌దార్ల అభివృద్ధిని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ సూప‌రింటెండెంట్ ఇంజినీర్ల‌, వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి, వి.శ్రీ‌నివాస్‌, ఆర్.హ‌నుమంత‌రెడ్డి, ఈఈ బి.శ్రీ‌ధ‌ర్‌, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Views: 56

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 546 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 154 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌