67వ డివిజన్ బరిలో నిలిచిన కెంబూరి భవానీ
సామాన్యులకు దక్కిన సీటు
సామాజిక న్యాయానికి పెద్దపీట
ఉత్సాహంగా ప్రచారం
అమరావతి టుడే ప్రతినిధి:
తీవ్ర ఉత్కంట కలిగించిన 67వ డివిజన్ కార్పొరేటర్ సీటు ఎట్టకేలకు జనసేన పార్టీకు చెందిన కెంబూరి భవానీ కృష్ణ దక్కించుకున్నారు. ఇక్కడ సీటు కోసం చివరి వరకు పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం శ్రమించిన కెంబూరి భవానీ కృష్ణకు అధిష్టానం సీటు కేటాయించింది. సామాజిక న్యాయంకు పెద్దపీట వేస్తూ అతి సామాన్యురాలైన కెంబూరి భవానీ కృష్ణకు సీటు కేటాయించటం పట్ల జనసేనలో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆమెకు సీటు రావటంతో జనసేన పార్టీ కోసం శ్రమించే వారికి తగిన గుర్తింపు ఇస్తుందని నిరూపితం అయ్యింది.
గెలుపును కానుకగా ఇస్తా… కెంబూరి భవానీ కృష్ణ
ఎన్ని వత్తిడిలు ఎదురైనప్పటికీ అధిస్టానం తమపై నమ్మకంతో తమకు సీటు కేటాయించారని.. ఇక్కడ తాను భారీ మెజార్టీతో గెలిచి జనసేన పార్టీకు కానుకగా ఇస్తానని కార్పొరేటర్ అభ్యర్ధి కెంబూరి భవానీ కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఇక్కడ ప్రతీ ఒక్కరితో మంచి పరిచయాలు ఉన్నాయని.. ప్రతీ సమస్య తనకు తెలుసునని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మేయర్ అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు ఆశీస్సులతో కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకోసం శ్రమిస్తానని అన్నారు. గురువారం ఆమె గడపగడపకు వెళ్ళి గాజు గ్లాసుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. కూటమితోనే అభివృద్ది సంక్షేమం జరుగుతుందని తనకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Views: 1092








