
అమరావతి టుడే ప్రతినిధి:
నిరుపేదల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా సేవాకార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం అని లయన్స్క్లబ్ జిల్లా గవర్నర్ నెక్కంటి వీ వీ ఎస్ ప్రసాద్ అన్నారు.స్ధానిక ప్రసాదంపాడులో బుధవారం సి వి ఆర్ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ పి. వెంకటేశ్వర రావు సహకారంతో నిరు పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొనిక్లబ్ ప్రెసిడెంట్ లయన్ అన్నాబత్తుల శరాబందీరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సైకిళ్ళు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి వి ఆర్ లయన్స్ క్లబ్ సభ్యులు ఒకే తాటిపై ఉండి, సేవా కార్యక్రమాలు చేస్తు ఇతర క్లబ్ లకు ఆదర్శంగా పనిచేస్తున్నారని అభినందించారు. తక్కిన క్లబ్లు సివీఆర్ క్లబ్లను ఆధర్శంగా తీసుకుని సేవాకార్యక్రమాలు చేయాలని సూచించారు. క్లబ్ అధ్యక్షులు లయన్ అన్నాబత్తుల శరాబందీరావు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తాము విద్యార్ధులకు సైకిళ్ళు పంపిణీ చేస్తున్నామని అన్నారు. తాము చేస్తున్న సేవాకార్యక్రమాలకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విజన్ కేర్ ఛైర్మన్ పునూరి దివ్యవాణి, జిల్లా లయన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ల సలహాదారు ఆర్. శ్రీలక్ష్మీ దేవీ, జిల్లా సెక్రటరీ రవీం«ద్ర, జి ఎల్ టి కో – ఆర్డినేటర్ శ్రీనివాసరావు అతిధులు గా పాల్గొని మాట్లాడారు. జిల్లా లయన్స్ క్లబ్ కేబినెట్ నాయకులు ఎమ్ ఎస్ ఇమాం బాష,తాటి వెంకట నారాయణ,దిలీప్, జి.శ్రీనివాసరావు, పి. లాం సునీతా, ఏ. బాలాజీ,నందివాడ శ్రీనివాసరావు,తోట సాయి,పి.వెంకటరమన,కొగిలి రాజశేఖరు,మధుసూధన రావు తదితరులు పాల్గొన్నారు.
Views: 1358







