సెరిబ్రల్‌ పాల్సీను ఆరంభంలోనే గుర్తించాలి

 

సెరిబ్రల్‌ పాల్సీను ఆరంభంలోనే గుర్తించాలి

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :

         సెరిబ్రల్‌ పాల్సీను ఆరంభంలోనే గుర్తించి.. చికిత్స, ఫిజియోధెరపీ సేవలు అందించటం ద్వారా మంచి ఫలితం సాధించవచ్చని చేయూత మానసిక వికలాంగుల శిక్షణ సంస్ధ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ కష్ణకుమారి అన్నారు. స్ధానిక చేయూత మానసిక వికలాంగుల శిక్షణ సంస్ధ కార్యాలయంలో మంగళవారం సెరిబ్రల్‌ పాల్సీడే పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెరిబ్రల్‌ పాల్సీ అనేది చిన్నారుల కదలికలు, కండరాల నియంత్రణ, సమతుల్యత, శారీరక అభివద్ధిపై ప్రభావం చూపే పరిస్థితి అన్నారు. ప్రతి చిన్నారిలో దీని ప్రభావం వేర్వేరుగా ఉండవచ్చునని తెలిపారు సరైన సమయంలో సమస్యను గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ తదితర సేవలను అందించడం ద్వారా పిల్లల రోజువారీ జీవన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు సహాయపడవచ్చునని తెలిపారు. ఈసందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు తల్లితండ్రులు అడిగిన పలు సందేహాలను నివత్తి చేశారు. కార్యక్రమంలో చేయూత మానసిక వికలాంగుల శిక్షణా సంస్ధ సిబ్బంది, ప్రత్యేక చిన్నారులు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Views: 266

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 546 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 154 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌