సెరిబ్రల్ పాల్సీను ఆరంభంలోనే గుర్తించాలి
అమరావతి టుడే ప్రతినిధి :
సెరిబ్రల్ పాల్సీను ఆరంభంలోనే గుర్తించి.. చికిత్స, ఫిజియోధెరపీ సేవలు అందించటం ద్వారా మంచి ఫలితం సాధించవచ్చని చేయూత మానసిక వికలాంగుల శిక్షణ సంస్ధ డైరెక్టర్ డాక్టర్ టీ కష్ణకుమారి అన్నారు. స్ధానిక చేయూత మానసిక వికలాంగుల శిక్షణ సంస్ధ కార్యాలయంలో మంగళవారం సెరిబ్రల్ పాల్సీడే పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెరిబ్రల్ పాల్సీ అనేది చిన్నారుల కదలికలు, కండరాల నియంత్రణ, సమతుల్యత, శారీరక అభివద్ధిపై ప్రభావం చూపే పరిస్థితి అన్నారు. ప్రతి చిన్నారిలో దీని ప్రభావం వేర్వేరుగా ఉండవచ్చునని తెలిపారు సరైన సమయంలో సమస్యను గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ తదితర సేవలను అందించడం ద్వారా పిల్లల రోజువారీ జీవన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు సహాయపడవచ్చునని తెలిపారు. ఈసందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు తల్లితండ్రులు అడిగిన పలు సందేహాలను నివత్తి చేశారు. కార్యక్రమంలో చేయూత మానసిక వికలాంగుల శిక్షణా సంస్ధ సిబ్బంది, ప్రత్యేక చిన్నారులు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Views: 266







