
జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
సీపీఎం లంకలపల్లి మధుసూధనరావు
అమరావతి టుడే ప్రతినిధి :
ఎన్టీఆర్‌జిల్లాలో హెఐవి సోకిన ప్రతీ ఒక్కరికీ మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏఆర్టీ, ఐసీటీసీ, స్వచ్చంద సంస్ధల సిబ్బంది సమన్వయంతో పనిచేసి..జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి సీపీఎం లంకలపల్లి మధుసూధనరావు సూచించారు. స్ధానిక పాతప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్‌లో బుధవారం ఏఆర్టీ వైద్యాధికారి డాక్టర్ వీర్నాల అంబేడ్కర్ అధ్యక్షతన ఏఆర్టీ, ఐసీటీసీ, స్వచ్చంద సంస్ధల ప్రతినిధుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవి సోకిన వారిని త్వరితగతిని గుర్తించి వైద్యసేవలు అందించటంతో పాటు వారికి ఆత్మస్ధైర్యం కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని గుర్తుంచుకోవాలని అన్నారు. అలాగే హెచ్‌ఐవి సోకిన ప్రతీ ఒక్కరూ సక్రమంగా మందులు వాడేలా చూడాలని వారిని ఎప్పటికప్పుడు ఫాలతోఅప్ చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పధకాలు, పింఛన్ అందించేందుకు పనిచేయలని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్టీ వైధ్యాధికారి డాక్టర్ చిత్ర, డాక్టర్ శ్రీదేవి, కౌన్సిలర్ కనకాల వరప్రసాద్, మంతెన సౌజన్య, మెడబలిమి భాస్కరరావు, లక్ష్మణరావు, డేటా మేనేజర్ బత్తుల విజయ, మేరుగ ప్రీతి, గాయత్రి,
విహాన్ సంస్ధప్రాజెక్టు ప్రాజెక్టు డైరెక్టర్, సిబ్బంది శ్రావణి , ఎన్టీఆర్‌జిల్లాలోని స్వచ్చంద సంస్ధల సిబ్బంది పాల్గొన్నారు.
Views: 812







