
అమరావతి పనుల్లో కార్మికులను పెంచండి
– అధికారులకు ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ఆదేశాలు
అమరావతి టుడే ప్రతినిధి
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో కార్మికులను అధిక సంఖ్యలో సమకూర్చి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు.
ఎన్-9, ఎన్-11 ట్రంక్ రోడ్ల నిర్మాణాలు, ఎల్పీఎస్ జోన్-9,10,12 తదితర ప్రాంతాలలో జరుగుతున్న పనులను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రంక్ రోడ్లలో జరుగుతున్న ముఖమైన మౌలిక సదుపాయాలైన తాగునీరు, స్ట్రామ్ వాటర్, పవర్లైన్ డక్టులలో కార్మికుల పనితీరును పరిశీలించారు. నిర్ధేశించిన కార్మికుల సంఖ్య కంటే స్వల్ప తేడా ఉండటంతో సదరు గుత్తేదారు సంస్థల వద్ద కార్మికుల సంఖ్యను పెంచాలని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.నరసింహమూర్తిని ఆదేశించారు. అక్టోబరు నుంచి మే నెల వరకు నిరంతరాయంగా పనులు జరిగి ప్రగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్-11, ఈ-1 జంక్షన్, ఎన్-9 రహదార్లలో జంక్షన్ల వద్ద అభివృద్ధి పనులు తక్షణం పూర్తిచేయాలని ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్-9లో అంతర్గత రహదార్ల అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పర్యటనలో ఏడీసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ల, వెంకటేశ్వరరెడ్డి, వి.శ్రీనివాస్, ఆర్.హనుమంతరెడ్డి, ఈఈ బి.శ్రీధర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Views: 56







