ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదు….కె.వి.ఎన్‌. చక్రధరబాబు

ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదు

– మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
– కేసులు పెరిగిన తర్వాత మేల్కొనడం కాదు.. ముందే గుర్తించి అడ్డుకోవాలి
– రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధరబాబు

అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి :

రాష్ట్రంలో మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యం, అలసత్వం, జాప్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌  అధికారులను హెచ్చరించారు. కేసులు పెరిగిన తర్వాత స్పందించడం అధికారుల పని కాదని.. కేసులు పెరగకుండా ముందే గుర్తించి అడ్డుకోవడమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఒక్క మలేరియా కేసును కూడా తేలికగా తీసుకోవద్దని, ముఖ్యంగా గిరిజన, మారుమూల, అధిక ప్రమాద ప్రాంతాల్లో అప్రమత్తతను మరింత పెంచాలని ఆదేశించారు. ముందస్తు నిఘా.. సత్వర పరీక్షలు.. సకాలంలో చికిత్స.. దోమల నియంత్రణ.. మందుల పూర్తి లభ్యత.. ఈ ఐదు అంశాల్లో ఎక్కడా లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.

విజయవాడలో మంగళవారం జరిగిన 28 జిల్లాల అధికారుల రాష్ట్రస్థాయి కార్యశాలలో మలేరియా పరిస్థితి, వ్యాధుల నిఘా, క్షేత్రస్థాయిలో దోమల నియంత్రణ, మందుల లభ్యత, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఐహెచ్‌ఐపీ–ఐడీఎస్‌పీ సమాచారం, ఏవేర్‌, ఏడీఎస్‌ వ్యవస్థల వినియోగం, క్రియాశీల–సాధారణ నిఘా, దోమల నియంత్రణ చర్యలు, మలేరియా నివారణ మందుల నిల్వలు, సిబ్బంది సామర్థ్య పెంపుపై చర్చించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయో ముందుగానే గుర్తించి, అక్కడ వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

కేసులు పెరిగే వరకు చూస్తే కుదరదు

మలేరియా కేసులు పెరిగిన తర్వాత చర్యలు ప్రారంభించడం అంటే జాప్యమేనని కమిషనర్‌ స్పష్టం చేశారు. వ్యాధి వ్యాప్తికి సంబంధించిన తొలి సంకేతాలు కనిపించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. సమాచారం అందిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే దాన్ని నిర్లక్ష్యంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో జ్వర కేసులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, మలేరియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని సూచించారు. మారుమూల ప్రాంతం కావడంతో కేసు ఆలస్యంగా గుర్తించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.

మందులు లేకపోతే బాధ్యత ఎవరిది?

మలేరియా పరిస్థితిని బట్టి మందుల అవసరాన్ని ముందుగానే అంచనా వేసి తగినంత నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కేసు వచ్చిన తర్వాత మందుల కోసం వెతికే పరిస్థితి ఎంతమాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు. కేటాయించిన నిధులను నిర్దిష్ట వ్యవధిలోగా వినియోగించాలని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికను సక్రమంగా రూపొందించకపోవడం వల్లే నిధుల వినియోగంలో వెనుకబడుతున్నారని పేర్కొన్నారు.

ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదు

మలేరియా నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేదని, జాప్యాన్ని సహించేది లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. కేసులు పెరిగే వరకు వేచి చూడొద్దని.. ముందే గుర్తించాలి.. వెంటనే స్పందించాలి.. వ్యాధిని అక్కడికక్కడే అడ్డుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల, అధిక ప్రమాద ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఒక్క మలేరియా మరణం కూడా జరగకుండా ప్రతి అధికారి, ప్రతి సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ వెంకటరమణ, జాయింట్‌ డైరెక్టర్‌ అర్జునరావు, డిప్యూటీ డైరెక్టర్‌ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 182

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌