సహజ వ్యవసాయంపై అతిథి ఉపన్యాసం
వ్యవసాయాన్ని సుస్థిర వ్యవస్థాపకత గా మార్చుకుని జీవన ప్రమాణాలను పెంచుకోవాలి.. డాక్టర్ కె భాగ్యలక్ష్మి
అమరావతి టుడే ప్రతినిధి :
మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర ఆధ్వర్యాన డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం యువజన సంఘం సహకారంతో ‘‘సహజ వ్యవసాయం – సుస్థిర వ్యవసాయ భవిష్యత్తు’’ అనే అంశంపై మంగళవారం అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో కిసాన్ అంగాడి వ్యవస్థాపకులు మారికంటి గోపాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని సహజ వ్యవసాయం, వ్యవస్థాపకత.. సుస్థిర జీవనోపాధులపై అతిథి ఉపన్యాసం చేశారు.. సహజ వ్యవసాయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సహజ వ్యవసాయం ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి వ్యవసాయాన్ని సుస్థిర వ్యవస్థాపకత గా మార్చుకుని జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆమె సూచించారు. కళాశాల బోటనీ విభాగాధిపతి డాక్టర్ జీ. స్వప్న మాట్లాడుతూ బీఎస్సీ బోటనీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ విద్యార్థులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.

గోపాలకృష్ణకు సత్కారం
విద్యార్థులను వ్యవస్థాపకత.. సుస్థిర అభివృద్ధి వైపు ప్రోత్సహిస్తున్న కిసాన్ అంగాడి వ్యవస్థాపకులు మారికంటి గోపాలకృష్ణ, శబరిని కళాశాల ప్రిన్సిపాల్ కె భాగ్యలక్ష్మి, జీ స్వప్ప కళాశాల అధ్యాపకులు విద్యార్ధులతో కలిసి సత్కరించారు. కార్యక్రమంలో బోటనీ విభాగ అధ్యాపకులు వి. పద్మావతి, శ్రీనివాస్ రెడ్డి , కాంత శ్రీ తదితరులు పాల్గొని సహజ వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకున్నారు
Views: 420







