ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

నిబద్దత కలిగిన నేత తోట పాండు
ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు
ఘనంగా సత్కరించిన టీడీపీ, జనసేన కార్పొరేటర్‌లు
అమరావతి టుడే ప్రతినిధి:
నిబద్దత కలిగిన మంచి నాయకుడు తోట పాండు అని 65వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి సతీష్, 62వ డివిజన్‌ కార్పొరేటర్‌ సమతం రాధా హేమలత అభినందించారు. స్ధానిక మారుతీనగర్‌లో గురువారం 65వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు తోట పాండు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని తోట పాండును శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహర్నిశలు పార్టీ కోసం ప్రజల కోసం శ్రమించే తోట పాండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయన పనితీరు, చేసిన సేవలు నిరుపమానం అని కొనియాడారు. కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ఆయన అందిస్తున్న సేవలు ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు. అనంతరం తోట పాండు భారీ కేక్‌ను కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 1540

  • Related Posts

    • SuryaSurya
    • November 7, 2026
    • 168 views
    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం! క్షత్రియ కార్పొరేటర్లను సత్కరించిన క్షత్రియ సేవాసంఘం నేతలు నగర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం.. సేవాసంఘం ప్రతినిధులు పెనుమత్స అప్పలరాజు, ఉద్దరరాజు విజయరామరాజు అమరావతి టుడే ప్రతినిధి: నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో కలిసి…

    Read more

    • SuryaSurya
    • November 3, 2026
    • 350 views
    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం! భారీ మెజార్టీతో విజయం సాధించిన కూటమి అభ్యర్థి రవీంద్ర గెలుపుతో 66వ డివిజన్‌లో కూటమి శ్రేణుల సంబరాలు ఆదరించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మట్ల…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు మరోమారు పట్టం

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు  మరోమారు పట్టం

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర