
వరుసగా రెండోసారి విజయకేతనం
2504 ఓట్ల భారీ మెజార్టీతో వల్లభనేని రాజేశ్వరి ఘన విజయం
65వ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్‌కు ప్రజల మరోమారు పట్టం
పట్టునిలుపుకున్న టీడీపీ.. మరోసారి బోల్తాపడ్డ వైసీపీ
డివిజన్లో టీడీపీ శ్రేణుల విజయోత్సవాలు
అమరావతి టుడే ప్రతినిధి:
65వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ విజయపరంపరను కొనసాగించింది. సిట్టింగ్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు. 2,504 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థిపై విజయం సాధించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. డివిజన్లో ప్రజల నుంచి లభించిన ఆదరణ, పార్టీ శ్రేణుల సమష్టి కృషి ఆమె విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గతంలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన సేవలు ఆమెకు మరోసారి విజయాన్ని అందించాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ ఫలితంతో 65వ డివిజన్లో టీడీపీ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు వైసీపీకి మరోసారి నిరాశ ఎదురైంది. భారీ మెజార్టీతో రాజేశ్వరి విజయం సాధించడంతో డివిజన్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వరుసగా రెండోసారి ప్రజల మద్దతుతో విజయం సాధించిన వల్లభనేని రాజేశ్వరికి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
Views: 238






