టీడీపీకు పెరిగిన జోష్
64వ డివిజన్ ఏకగ్రీవం కావటంతో దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్
ఆదివారం భారీగా చేరికలు
శాలువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బోండా ఉమా
అమరావతి టుడే ప్రతినిధి:
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ కూటమి నేతలలో జోష్ పెరిగింది. ముఖ్యంగా నగరంలోని 64వ డివిజన్ టీడీపీకు ఏకగ్రీవం కావటంతో టీడీపీ సీనియర్ నాయకులు వీరమచనేని కిషోర్ జోరు మరింత పెంచారు. 64వ డివిజన్‌లో మేయర్ అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించటంతో పాటు తక్కిన డివిజన్‌లలో టీడీపీ, జనసేన అభ్యర్ధుల గెలుపుకోసం పనిచేస్తున్నారు. వీరమాచనేని కిషోర్ తనకు ఉన్న రాజకీయ చతురత పరిచయాలను వినియోగించుకుని టీడీపీ జనసేన గ్రాప్‌ను మరింత పెంచుతున్నారు.
టీడీపీలో చేరిన బొప్పన గాంధీ
డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు బొప్పన గాంధీ ఆదివారం వీరమాచనేని లలిత కిషోర్ ఆధ్వర్యాన అనుచరులతో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.
కూటమి పనితీరు నచ్చి పార్టీలో చేరుతున్నాం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి పాలన తమకు నచ్చిందని… అందువల్లే తాము వీరమాచనేని లలిత కిషోర్ ఆధ్వర్యాన స్వచ్చందంగా పార్టీలో చేరుతున్నామని బొప్పన గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క చిన్న అవకాశంకు తావు ఇవ్వకుండా ఎన్నికలలో కలిసిమెలసి పనిచేసి పార్టీ అభ్యర్ధులను అఖండమెజార్టీతో గెలిపించాలని సూచించారు.
వీరమాచనేని కిషోర్ స్ఫూర్తితో విజయానికి పనిచేయాలి
టీడీపీ, జనసే, బీజేపీ నేతలు వీరమాచనేని కిషోర్ స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని.. పార్టీ అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. వీరమాచనేని కిషోర్ పలు డివిజన్‌లకు చెందిన అభ్యర్ధుల పక్షాన నిలిచి వారి విజయానికి చేస్తున్న కృషిని అభినందించారు. ఇదే విధంగా చివరి వరకు పనిచేసి సెంట్రల్ నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా దూసుకువెళ్ళాలని దిశానిర్ధేశం చేశారు.
Views: 2114






