మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి, పద్యశతకం ఆవిష్కరణ

 

మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి, పద్యశతకం ఆవిష్కరణ
అమరావతి టుడే ప్రతినిధి:
బహు శతక కర్త, శతక శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ రచించిన మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి పద్యశతకంను దత్తాత్రేయ స్వామి దేవాలయం ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్‌ శనివారం సాయంత్రం ఆలయంలో ఆవిష్కరించారని మారుతీగ్యాస్‌ కంపెనీ అధినేత చెట్లపల్లి మారుతీ ప్రసన్న తెలిపారు. ముత్యాలంపాడులోని మారుతీగ్యాస్‌ కంపెనీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బహు శతక కర్త ఉప్పులూరి లక్ష్మీనారాయణ రచించిన మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి పద్యశతకంను తాము ప్రచురించటం జరిగిందన్నారు. పద్మశతక ఆవిష్కరణ కర్త పవని నాగేంద్ర ప్రసాద్‌ స్వామివారి మహత్యం, క్షేత్ర ప్రాశస్త్యం, పద్య శతక ఔన్నత్యాన్ని, ఘనంగా వివరించారని కొనియాడారని తెలిపారు. స్వామివారి శతకాన్ని ప్రచురించటం తన జన్మజన్మల భాగ్యం అని, శతకం ఆద్యంతం, అమృతప్రాయమని కొనియాడారు. ‘‘బహు శతక కర్త,‘‘శతక శ్రీ‘’ ఉప్పులూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, స్వామివారి శతకను రాయటం,తన జన్మజన్మల భాగ్యం అని, స్వామివారు అతి చిన్న వయస్సులో జీవసమాధి పొంది, నేడు లక్షలాది మంది భక్తులకు, వారి ఆర్తిని తీర్చి, కోర్కెలు నెరవేర్చి, బాధలు తీర్చి, వెన్నంటి కాపాడటం, బహుధా విశేషమని అన్నారు. ఈ శతకాన్ని భక్తులు స్వీకరించి స్వామివారి, మహత్యాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని కోరారు. డాక్టర్‌ బ్రహ్మ దేశం సోషల్‌ సర్వీస్‌ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ బ్రహ్మదేశం వసంత కుమార్‌ మాట్లాడుతూ, స్వామివారి పద్య శతకం, అమృతతుల్యమని, స్వామివారి మహత్యం,అనిర్వచనీయమని, శ్లాఘించారు. కార్యక్రమంలో ఎక్సరే సంస్థ సంయుక్త కార్యదర్శి గుర్రం ఏడుకొండలు, లక్ష్మణరావు, బి విశ్వేశ్వరరావు, వెంకటసుబ్బయ్య తదితరులు ఫాల్గొని మాట్లాడారు.

Views: 504

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌