
పార్టీ అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తున్న స్వతంత్య్ర అభ్యర్ధి బాబీ
హోరాహోరీ పోరు
బ్యాట్‌తో అధికార, ప్రతిపక్ష అభ్యర్ధులను బౌండరీ దాటిస్తా.. బాబీ
ప్రజలతో మమేకం అవుతున్న బ్యాట్ గుర్తు బాబీ
అమరావతి టుడేప్రతినిధి:
69వ డివిజన్ స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంధ్రకుమార్(బాబీ) ప్రచారం జోరందుకుంది. ఆదివారం బాబీ టీడీపీకు రాజీనామా చేసిన నేతలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్దిచెప్పాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకునిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో జనసేన, వైఎస్సార్‌సీపీలకు ఓటమి తప్పదని తన కోసం ఎంతోకాలంగా పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్న వారు సైతం పార్టీలకు రాజీనామా చేసి తన వెంట నిలిచారని బాబీ అన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా…
తనపై నమ్మకంతో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటానని.. ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని బాబీ హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాసం ఇస్తే నాయకునిగా కాకుండా సేవకునిగా సేవ చేస్తానని అన్నారు. ఇంత మంది ప్రజల అభిమానం తనకు దేవుడు ఇచ్చిన వరంగా బావిస్తున్నానని అన్నారు.
అధికారం, ప్రలోభాలతో గెలవలేరు..
అధికార జనసేన పార్టీ అభ్యర్ధి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు ఎన్నికలలో అధికారం ప్రలోభాలతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ ప్రజాక్షేత్రంలో తాము ఖచ్చితంగా గెలుస్తామని స్వతంత్య్ర అభ్యర్ధి బాబీ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని యుక్తులు, కుయుక్తులు పన్నినప్పటికీ విజయం మాత్రం తనదేనని అంటున్నారు. డివిజన్‌లో ప్రజలు సైతం అ«త్యధిక శాతం బ్యాట్ బాబీ వెంటే ఉన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులను బౌండరీ దాటించాలని బాబీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Views: 658







