న‌గ‌రాల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త ఇదేనా?

  – విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో 32వేల ఓట్లు
– కూట‌మి నేత‌లు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం త‌గ‌దు
– టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్య‌ద‌ర్శి, న్యాయ‌వాది పిళ్లా శ్రీ‌నివాస‌రావు ఆగ్ర‌హం

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి : విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక ఓటింగ్ ఉన్న న‌గ‌రాల సామాజిక వ‌ర్గానికి కూట‌మి నేత‌లు స‌రైన ప్రాతినిధ్యం క‌ల్పించ‌క‌పోవ‌డం త‌గ‌ద‌ని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్య‌ద‌ర్శి, న్యాయ‌వాది పిళ్లా శ్రీ‌నివాస‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న తమ వర్గానికి తగిన గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని వాపోయారు. గతంలో నగరాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారని, ప్రస్తుతం నియోజకవర్గంలో తమ వర్గానికి 32 వేలకుపైగా ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ కూటమి నాయకత్వం తమకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదని విమర్శించారు. విశాఖపట్నంలో తమ వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు విజయవాడలో ఎందుకు వివక్ష చూపుతున్నార‌ని ఆయ‌న‌ ప్రశ్నించారు. తమ మద్దతుతో గెలిచిన నాయకుడు హామీ ఇచ్చిన వెయ్యి గజాల స్థలాన్ని ఇప్పటివరకు కేటాయించలేదని ఆరోపించారు. నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏడాదిగా భర్తీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి జనాభా, ఓటు బలానికి అనుగుణంగా రాష్ట్రస్థాయి రాజకీయ ప్రాధాన్యత, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని శ్రీ‌నివాసరావు డిమాండ్ చేశారు.

Views: 154

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో పేరం త్రివేణిరెడ్డి ప్రచారం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, తనకు ఒక్క అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల వేళ ప్రతి ఓటు కీలకంగా మారుతున్న…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌