మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం!
క్షత్రియ కార్పొరేటర్లను సత్కరించిన క్షత్రియ సేవాసంఘం నేతలు
నగర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం.. సేవాసంఘం ప్రతినిధులు

పెనుమత్స అప్పలరాజు,
ఉద్దరరాజు విజయరామరాజు
అమరావతి టుడే ప్రతినిధి:
నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో కలిసి తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని క్షత్రియ సేవాసంఘం అధక్ష, ప్రధాన కార్యదర్శి పెనుమత్స అప్పలరాజు, ఉద్దరరాజు విజయరామరాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాల్లో ప్రజాప్రతినిధులకు తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు నగర సమగ్ర అభివృద్ధికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు సమన్వయంతో ముందుకు సాగితే నగర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మేయర్‌ వంగవీటి రాధాకృష్ణతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌లు పిన్నంరాజు త్రిమూర్తిరాజు, గాది శ్రీనివాసరాజులను సేవాసంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ప్రజల ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులు నగర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.నగరంలో రెండు డివిజన్‌లలో క్షత్రియులు విజయం సాధించటం సంతోషంగా ఉందన్నారు. నగర అభివృద్దికి కులమతాలు రాజకీయాలకు అతీతంగా సహకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కెఎస్‌ ప్రసాదరాజు, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

Views: 168

  • Related Posts

    • SuryaSurya
    • November 5, 2026
    • 1540 views
    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    నిబద్దత కలిగిన నేత తోట పాండు ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు ఘనంగా సత్కరించిన టీడీపీ, జనసేన కార్పొరేటర్‌లు అమరావతి టుడే ప్రతినిధి: నిబద్దత కలిగిన మంచి నాయకుడు తోట పాండు అని 65వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి…

    Read more

    • SuryaSurya
    • November 3, 2026
    • 350 views
    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం! భారీ మెజార్టీతో విజయం సాధించిన కూటమి అభ్యర్థి రవీంద్ర గెలుపుతో 66వ డివిజన్‌లో కూటమి శ్రేణుల సంబరాలు ఆదరించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మట్ల…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    మేయర్, క్షత్రియ కార్పొరేటర్లకు ఘన సత్కారం

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    ఘనంగా తోట పాండు జన్మదిన వేడుకలు

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    తొలి ప్రయత్నంలోనే ఘన విజయం.. 66వ డివిజన్‌లో మట్ల రవీంద్ర జయకేతనం!

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు మరోమారు పట్టం

    65వ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు  మరోమారు పట్టం

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    పదవీవిరమణ వయస్సుకే కానీ మనస్సుకాదు

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర