చిన్నారి గుండెకు మంత్రి సుభాష్ అండ

నాలుగు నెలల చిన్నారి గుండెలో పెద్ద రంధ్రం.. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం

పాప ప్రాణం కోసం రోజంతా ఆసుపత్రిలో మంత్రి సుభాష్

పేద తల్లిదండ్రులకు పెద్దదిక్కుగా నిలిచిన మంత్రి సుభాష్

ఆసుపత్రికి స్వయంగా వెళ్లి వైద్యులతో మాట్లాడిన మంత్రి సుభాష్

ఎల్ వో సి తో పాటు ఆపరేషన్ ఖర్చులు భరిస్తానని హామీ.. తల్లిదండ్రులకు భరోసా

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :
పుట్టిన నాలుగు నెలలకే తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పెద్దదిక్కుగా నిలిచారు. పేదరికంతో వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ.. ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి)తో పాటు ఆపరేషన్ కు అవసరమైన ఖర్చులు భరిస్తానని భరోసా కల్పించారు. పనులన్నీ పక్కనపెట్టి పాప ప్రాణం కోసం మంత్రి పడిన తాపత్రయం ఆయన మానవత్వానికి నిదర్శనం. వివరాల్లోకెళితే
రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం శివారు చింతగుంట చెరువుకు చెందిన మేడిశెట్టి జీవన్ కుమార్- చంద్రిక దంపతుల నాలుగు నెలల చిన్నారి రియాన్సీ గ్రేస్ పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తరచూ ఆయాసపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చూపించారు. వైద్య పరీక్షల్లో చిన్నారి గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన ఆంధ్ర ఆసుపత్రి విజయవాడ వైద్యులు వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు.

అయితే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించే స్థోమత లేక ఆ నిరు పేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో మంత్రి సుభాష్‌ను ఆశ్రయించారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. చిన్నారిని విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్లి, అక్కడి వైద్యులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లోనే ఆపరేషన్ జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యులను కోరారు.

చిన్నారి వైద్యానికి అవసరమైన ఖర్చును తాను భరిస్తామని మంత్రి సుభాష్ వైద్యులకు, చిన్నారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగి చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరేలా అవసరమైన సహాయాన్ని అందిస్తానని వారికి ధైర్యం చెప్పారు.

తమ చిన్నారి ప్రాణాల కోసం ఆందోళన చెందుతున్న సమయంలో మంత్రి సుభాష్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడటం, తమకు అండగా నిలవడం పట్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఈ సమయంలో మంత్రి సుభాష్ అందించిన భరోసా జీవితాంతం మర్చిపోలేమని వారు తెలిపారు.

ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అది తన కుటుంబానికి వచ్చిన కష్టంగా భావిస్తూ స్పందిస్తున్న మంత్రి సుభాష్ సేవాగుణానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. పదవికి పరిమితం కాకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, అవసరమైన సమయంలో పెద్దకొడుకులా ధైర్యం కల్పిస్తున్నారంటూ పలువురు అభినందిస్తున్నారు.

చిన్నారి రియాన్సీ గ్రేస్‌కు శస్త్రచికిత్స విజయవంతమై, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ కుటుంబానికి మంత్రి సుభాష్ అందిస్తున్న అండ, ఆప్యాయత వారికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఇదే కదా నిజమైన మానవత్వం, సేవాగుణం అంటూ మంత్రి సుభాష్ పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Views: 910

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌