పేక్షకులను రంజింప చేసిన శ్రీతన్వి కూచిపూడి నృత్యం


అమరావతి టుడే ప్రతినిధి:
ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో షిర్డీసాయినాధుని పుణ్యతిధి మహోత్సవాలలో భాగంగా చిన్నారి శ్రీతన్వీ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పేక్షకులను రంజింప చేసింది. భక్తికీర్తనలకు అనగుణంగా శ్రీతన్వి చేసిన నృత్యప్రదర్శన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఆధ్యంతం భక్తితత్వంను పెంపొందించే విధంగా నృత్యప్రదర్శన జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు చిన్నారి శ్రీతన్వీ నృత్యప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.అనంతరం చిన్నారి శ్రీతన్వీకు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి చేతులమీదుగా మెమెంటో జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే చక్కటి ప్రదర్శన చేయటంతో పాటు పలువురి ప్రశంసలు అందుకోవటం అభినందనీయం అని కొనియాడారు. ఇప్పటికే శ్రీతన్వీ కాశీ, రామేశ్వరం, తిరుమల, గురవాయర్, బెంగుళూరు, భధ్రాచలం,ఏలూరు, విజయవాడ కనక దుర్గ అమ్మవారి దేవాలయం తదితర ప్రాంతాలలో నృత్య ప్రదర్శన చేసి మెప్పించిందని అభినందించారు. కార్యక్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి కుంచనపల్లి రవిశంకర్, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి పాల్గొన్నారు.

Views: 476

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌