భవాని ఐలాండ్‌కు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు–2026


అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం భవాని ఐలాండ్‌కు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు–2026 లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ షా, ఐఏఎస్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ధ్యాన్ చంద్, ఐఏఎస్, ఎమ్మెల్సీ శ్రీ వర్ల రామయ్య చేతుల మీదుగా జిల్లా పర్యాటక శాఖ తరఫున జిల్లా పర్యాటక అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ అవార్డును అందుకున్నారు. భవాని ఐలాండ్‌లో పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు జిల్లా పర్యాటక అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. పర్యాటక కేంద్రాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, స్వచ్ఛమైన పర్యాటక ప్రదేశాలు – ఆకర్షణీయమైన పర్యాటక అనుభవాలు అనే లక్ష్యంతో మరిన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. భవాని ఐలాండ్‌కు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించడం పట్ల జిల్లా పర్యాటక అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ షా ఐఏఎస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారం, మార్గదర్శకత్వంతో ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

Views: 1232

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 546 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 154 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌