అమిత్ షాకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ జన్మదిన శుభాకాంక్షలు
అమరావతిటుడే ప్రతినిధి : దేశ సమగ్రత, అంతర్గత భద్రత పరిరక్షణలో అమిత్ షా కృషి ప్రశంసనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కొనియాడారు. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా కి మాధవ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా అమిత్ షా అందిస్తున్న సేవలు అభినందనీయమని మాధవ్ పేర్కొన్నారు. ఆయన దృఢ సంకల్పం, అచంచల నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వం దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశ అభివృద్ధి ప్రస్థానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
Views: 238







