జర్నలిస్టుల భద్రతకు హైపవర్ కమిటీ

దాడులు, హత్యలు, వేధింపుల కేసుల పరిశీలనకు ప్రభుత్వం నిర్ణయం

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపుల కేసులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం జి.ఓ. జారీ చేసింది.
జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి సిఫార్సులు చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించినట్లు ప్రకటనలో పేర్కొంది.

కమిటీలో ఎవరెవరు?

రాష్ట్ర హోంశాఖ మంత్రి చైర్మన్‌గా, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హోం, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐజీ (లా అండ్ ఆర్డర్), జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సమాచార–పౌరసంబంధాల శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జర్నలిస్టులపై దాడులు, హత్యలు, వేధింపుల ఘటనలను పరిశీలించడంతో పాటు భద్రత, సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. కమిటీ ఏర్పాటుపై జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Views: 280

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌