ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్‌–రే టీబీ పరీక్షలు

ఆటోనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్‌–రే ద్వారా టీబీ పరీక్షలు
అమరావతి టుడే ప్రతినిధి:
జిల్లా టీబీ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్‌ భాను నాయక్‌ ఆదేశాల మేరకు ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్‌–రే ద్వారా టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి డాక్టర్‌ ఆర్‌. స్వర్ణలత సూచించారు. స్ధానిక ఆటోనగర్‌లో సోమవారం వాసవ్య మహిళా మండలి అపోలో టైర్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్, ఎన్టీఆర్‌ జిల్లా టీబీ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఊపిరి తిత్తుల రోజు పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిబిరంలో సాధారణ అనారోగ్య సమస్యలకి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే కార్మికులలో వివిధ కార్యక్రమాల ద్వారా క్షయవ్యాధిపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అపోలో టైర్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ ప్రాజెక్టు మేనేజర్‌ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గాలి ద్వారా ఒకరి నుండి ఇతరులకు క్షయ వ్యాధి సులభంగా సంక్రమిస్తుందన్నారు. క్షయ ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారు. షుగర్‌ అదుపులో లేనివారికి, హెచ్‌ఐవి సోకినవారితో పాటు మందులు సక్రమంగా వాడని వాళ్ళకి, స్టెరాయిడ్‌ మందులు అధిక మోతాదులో వాడేవాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
అనంతరం ఎన్టీఆర్‌ జిల్లా టీబీ నియంత్రణ సంస్థ ఎస్‌ టి ఎస్‌ ఉమా మహేశ్వర రావు సిబ్బందితో కలిసి ఉచితంగా ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్‌–రే ద్వారా టీబీ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా క్షయ వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి సిబ్బంది, ఎజెఆర్‌ సత్యప్రసాద్‌ , ఎస్‌ .ఆనందరావు, డి.నాగరాజు, పి.సుదర్శన్‌ , డి.వీరాంజనేయులు, ఎం.సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Views: 336

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌