
ఆశావహుల రేసులో ముందంజ
అందరివాడిగా మన్ననలు అందుకుంటున్న రవి
అమరావతి టుడే ప్రతినిధి:
మరి కొద్ది రోజులలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కూటమి బలంగా ఉండటంతో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా బావిస్తుండటంతో గెలుపుగుర్రాలకే అవకాశం కల్పించాలని.. ఏ చిన్న అవకాశం చేజార్చుకోకూడదని భావిస్తున్నారు. ఈ నేపద్యంలో ఇప్పటికే ఆశావహుల స్క్రీనింగ్ జోరుగా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. గతంలో 30వ డివిజన్‌గా ఉండి డివిజన్‌ల పునర్విభనలో భాగంగా 66వ డివిజన్‌గా మారిన వినాయకనగర్ నుంచి కూటమి అభ్యర్ధిగా వినాయకనగర్ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియోషన్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మట్ల రవీంద్ర (రవి) కార్పొరేటర్ అభ్యర్ధి రేసులో ముందంజలో ఉన్నారు. జీవీఆర్‌నగర్, దావు బుచ్చయ్యకాలనీ, వినాయకనగర్, సాయినగర్ తదితర ప్రాంతాలలో రాజకీయాలకు అతీతంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. కాలనీ అభివృద్దిలో తనదైన ముద్ర వేశారు..ముఖ్యంగా బుడమేరు ముంపు సమయంలో ఆయన ప్రతీ ఒక్కరికీ అండగా నిలవటంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సీటు లాంఛన ప్రాయమే….
అందరికీ సుపరిచితుడు.. వివాద రహితుడు.. కాలనీ అభివృద్ది కారకుడుగా పనిచేసిన మట్ల రవికి కార్పొరేటర్ అభ్యర్ధిత్వం లాంఛన ప్రాయమేనని సర్వత్రా వినిపిస్తుంది. ఈయన ఇప్పటికే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని కలిసి తన పేరు కార్పొరేటర్ అభ్యర్ధిగా పరిశీలించాలని దరఖాస్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం…

అవకాశం ఇస్తే.. సేవ చేస్తా….మట్ల రవి
ఇప్పటి వరకు రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసొసియోషన్ వ్యవస్ధాపక అధ్యక్షుడుగా కాలనీ అభివృద్దికి కృషి చేశాను. కనీసం మౌలిక సదుపాయాలు లేని స్ధితి నుంచి అభివృద్ధిలో పోటీ పడేలా తీర్చిదిద్దాననే సంతృప్తి ఉంది. ఇప్పుడు తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే ప్రజలకు మరింత సేవలు చేయటంతో పాటు డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని మట్ల రవి తెలిపారు.
Views: 8736







