స‌మాన‌త్వం కోసం పోరాడిన మ‌హాక‌వి గుర్రం జాషువా

– విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా జాషువా జ‌యంతి వేడుక‌లు
– న‌లుగురు సాహితీవేత్త‌ల‌కు పుర‌స్క‌రాలు ప్ర‌దానం చేసిన మంత్రి కందుల దుర్గేష్‌

అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : భావకవిత్వం ఉప్పొంగుతున్న కాలంలోనే సామాజిక స్పృహను జోడించి, అణగారిన వర్గాల వేదనలను తన పద్యాలుగా మలచిన అరుదైన ప్రజాకవి గుర్రం జాషువా అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు..రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ లో పద్మభూషణ్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మహాకవి గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వేడుకల్లో భాగంగా తెలుగు సాహిత్య వికాసానికి, మనుగడకు, పరిరక్షణకు విశేష కృషి చేసిన ప్రముఖ సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు కొమ్మవరపు, గడ్డం ఈశ్వరమ్మలకు ‘కవిసామ్రాట్ గుర్రం జాషువా కవికోకిల సాహితీ పురస్కారం’ కింద రూ. 50,000 నగదు ప్రోత్సాహకం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని మంత్రి దుర్గేష్ అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలపై తన కలంతో పోరాడి, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి తన సాహిత్యం ద్వారా స్వరం అందించిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని కొనియాడారు. నాటి కాలంలోనే మానవ హక్కులు, సమానత్వం కోసం ఆయన తన గబ్బిలం, ఫిరదౌసి తదితర కవితల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేశార‌ని తెలిపారు. అంటరానితనాన్ని ఎదుర్కోవడానికి అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న ధీశాలి అని కొనియాడారు. జాషువా బాటలోనే నడుస్తూ ఆయన ఆశయ సాధనకు, సమసమాజ నిర్మాణానికి మనమంతా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

త్వరలోనే కందుకూరి పురస్కారాలు

నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో పద్యాలను రచించిన మహాకవి గుర్రం జాషువా అని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ల కృషితో రాష్ట్రంలో సాంస్కృతిక రంగానికి సువర్ణయుగం వచ్చిందన్నారు. ఇటీవలే బోయి భీమన్న అవార్డులు అందించామని, త్వరలోనే కందుకూరి పురస్కారాలతో పాటు నంది నాటకోత్సవాలు, నంది అవార్డులను కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జాషువా క‌విత్వం ప్ర‌శ్నిస్తోంది… తేజ‌స్వి
సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ…జాషువా కవిత్వం ఎప్పుడూ ఆలోచింపజేస్తుందని, ప్రశ్నిస్తుందని, సమాజంలోని వివక్షను పారద్రోలేలా మార్పును కోరుతుందని తెలిపారు. ఎన్నో కష్టాలను అనుభవించి ఆ అనుభవాలనే కవిత్వంగా మలచి సమాజాన్ని తట్టిలేపిన గొప్ప కవి జాషువా అని, ఆయన ఆశయ సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జున రావు పలువురు ప్రముఖులు, సాహితీ ప్రియులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 406

Related Posts

  • SuryaSurya
  • October 27, 2026
  • 546 views
66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

Read more

  • SuryaSurya
  • October 27, 2026
  • 154 views
ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌