
గురుకుల కళాశాలలో గుర్రం జాషువా జయంతి
అమరావతి టుడే ప్రతినిధి:
మాచవరం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని గురుకుల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో సోమవారం గుర్రం జాషువా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లూరు నీరజ, వైస్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి గుర్రం జాషువా చిత్రపటానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు.గబ్బిలం కావ్యంలో ఒక అణగారిన మనిషి తన బాధను తన ఆవేదనను జాషువా వర్ణించిన తీరు ప్రతీ ఒక్కరి హృదయంను కదిలించిందని అన్నారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 252







