విజ‌య‌వాడ మేయ‌ర్ రేసులో కొత్త ట్విస్ట్!

– వంగ‌వీటి ఎంట్రీతో కూట‌మిలో క‌ల‌క‌లం

– ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో వంగ‌వీటి రాధా భేటీ వెనుక బిగ్ పొలిటిక‌ల్ స్కెచ్

– జ‌న‌సేన నుంచి రాధా మేయ‌ ర్ బ‌రిలో నిలుస్తార‌నే ఊహాగానాలు

– టీడీపీ ఆశావ‌హుల‌కు చుక్కెదురేనా ?

 

అమ‌రావ‌తి టుడే న్యూస్ ప్ర‌తినిధి :

విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో కూట‌మి లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయా అంటే ఔన‌నే మాటే వినిపిస్తోంది. టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ వంగ‌వీటి రాధాకృష్ణ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌వ‌డం వెనుక బిగ్ పొలిటిక‌ల్ స్కేచ్ ఉంద‌న్న వాద‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి. గ‌త కొంత‌కాలంగా వంగ‌వీటి రాధా రాజ‌కీయంగా స్త‌బ్ధుగా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క వ‌ర్గం నుంచి రాధా టీడీపీ టిక్కెట్ ఆశించారు. సెంట్ర‌ల్‌పై గ‌ట్టి ప‌ట్టు ఉన్న బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు టీడీపీ హైక‌మాండ్ వ‌ద్ద త‌న‌కున్న ప‌ర‌ప‌తి ఉప‌యోగించి టీడీపీ టిక్కెట్ ద‌క్కించుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో సుమారు 80 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డ రాధా కు ఎమ్మెల్సీ లేదా రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఇస్తామ‌ని అప్ప‌ట్లో టీడీపీ హైక‌మాండ్ బుజ్జ‌గించింది. సీన్ క‌ట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు దాటిపోయిన‌ప్ప‌టికీ రాధాకు ఎలాంటి నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్క‌లేదు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ ప‌ద‌వులు భ‌ర్తీ అవుతున్న‌ప్పుడ‌ల్లా వంగ‌వీటి రాధా పేరు తెర‌పైకి రావ‌డం చివ‌రి నిమిషంలో తూచ్ అన‌డం రొటీన్‌గా సాగుతోంది. దీంతో వంగ‌వీటి అభిమానులు తీవ్ర నిరాశ‌తో ఉన్నారు.

కార‌ణం అదేనా ?

వంగ‌వీటి రాధాకు నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డం వెనుక స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ తంత్రం ఉంద‌నే ఆరోప‌ణ‌లు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. కాపు సామాజిక వ‌ర్గం స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా ను నేటికీ దైవంలా కొలుస్తోంది. జ‌న‌సేన ప్ర‌ధాన ఓట్ బ్యాంక్ కాపు స‌మాజిక వ‌ర్గ‌మే అనేది కాద‌న‌లేని నిజం. 2024 ఎన్నిక‌ల్లో 100 శాతం స్టైక్ రేట్‌తో అనూహ్య విజ‌యం సాధించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాపు సామాజిక వ‌ర్గానికి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. వంగ‌వీటి రాధాకు నామినేటెడ్ ప‌ద‌వి వ‌చ్చి ఆయ‌న పొలిటిక‌ల్‌గా ఎక్టివ్ అయితే కాపు సామాజిక వ‌ర్గం స‌మీక‌ర‌ణ‌ల్లో మార్పు వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈక్ర‌మంలోనే వంగ‌వీటి రాధా కు నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్క‌డం లేద‌నే వాద‌న‌లు ఉన్నాయి.

రాధా రూటు మారుస్తున్నారా

వంగ‌వీటి వార‌సుడిగా 2004 ఎన్నిక‌ల్లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన రాధా నాడు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి తూర్పు నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేసి మ‌రోసారి ఓట‌మి చ‌విచూశారు. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యవాడ సెంట్ర‌ల్ వైసీపీ టిక్కెట్ ను ఆశించి భంగ‌ప‌డ్డ రాధా ఆపార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ టిక్కెట్ ఆశించిన‌ప్ప‌టికీ ద‌క్క‌లేదు. ఈక్ర‌మంలోనే రాధా రాజ‌కీయం ఎత్తుగ‌డ మారుస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశార‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయంగా ప‌లు అంశాల‌పై వాడివేడి చ‌ర్చ సాగిన‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు

ఇటీవ‌ల కాకినాడ‌లో నిర్వ‌హించిన జ‌న‌సేన స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం మేయ‌ర్ల‌తో సహా బ‌లం ఉన్న ప్ర‌తిచోట పోటీ చేస్తామంటూ పార్టీ శ్రేణుల‌కు బూస్ట్ ఇచ్చారు. కూట‌మిలో పొత్తు కుద‌ర‌ని ప‌క్షంలో ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. స‌రిగ్గా ఇది జ‌రిగిన రెండు రోజుల‌కే వంగ‌వీటి రాధా, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భేటీ అవ్వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

విజ‌య‌వాడ మేయ‌ర్ సీటు కోసం టీడీపీలో ఆశావ‌హులసంఖ్య పెరుగుతోంది. సెంట్ర‌ల్ ఎమ్మెల్యే కుమారుడు బొండా సిద్ధార్థ పేరు ఇందులో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అలాగా స్వ‌చ్ఛంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ట్టాభి, మాజీ జ‌డ్పీ ఛైర్మ‌న్ గ‌ద్దె అనూరాధ‌, సీనియ‌ర్ నేత గొట్టిముక్క‌ల ర‌ఘురామ‌రాజుతో స‌హా మ‌రో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి మేయ‌ర్ సీటు క‌మ్మ సామాజిక వ‌ర్గానికే కేటాయించాల‌నే డిమాండ్ ఊపందుకుంటుంది. అయితే ఇప్ప‌టికే బొండా ఉమా యువ‌నేత లోకేష్ నుంచి గ‌ట్టి హామీ పొందార‌నే ప్ర‌చారం న‌గ‌రంలో జోరుగా సాగుతోంది. మేయ‌ర్ సీటు కోసం టీడీపీ లో క‌మ్మ వ‌ర్సెస్ కాపు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య సైలెంట్ వార్ సాగుతోంద‌నేది కాద‌న‌లేని నిజం. ఈక్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేస్తున్న‌ట్లు విజ‌య‌వాడ మేయ‌ర్ సీటు జ‌న‌సేన‌కు కేటాయిస్తే బెట‌ర్ అనే ఓ ఆలోచ‌న టీడీపీ హై క‌మాండ్ వ‌ద్ద ఉన్న‌ట్లు టాక్‌. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అవ‌నిగ‌డ్డ‌లో మండ‌లి బుద్ధ ప్ర‌సాద్. పాల‌కొండ‌లో నిమ్మ‌కృష్ణ టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి జంప్ చేసి టిక్కెట్ పొంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అదే త‌ర‌హాలో టీడీపీకి చెందిన వంగ‌వీటి రాధా జ‌న‌సేన లో చేరి మేయ‌ర్ అభ్య‌ర్థిగా విజ‌య‌వాడ బ‌రిలో నిలుస్తార‌నే టాక్ న‌డుస్తోంది.. ఇదే నిజ‌మైతే ఈ ఎపిసోడ్ వెనుక రాజ‌కీయ చాణుక్యుడి హ‌స్తం ఉంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Views: 8190

Related Posts

  • SuryaSurya
  • October 29, 2026
  • 294 views
కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

నగర అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని …

Read more

  • SuryaSurya
  • October 27, 2026
  • 644 views
66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.