ఎ.కొండూరులో రూ.94.97 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్

– నాలుగు మండలా
లకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా
 – ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి : విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొం

డూరులో రూ.94.97 కోట్లతో ఏపీ ట్రాన్స్‌కో నిర్మించిన 220/132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సబ్ స్టేషన్‌తో ఎ.కొండూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, తిరువూరు మండలాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా ఎ.కొండూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ ఎదురయ్యే లో-వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధిక సామర్థ్యంతో ఎ.కొండూరు సబ్ స్టేషన్‌ను నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరాను విస్తరించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

Views: 140

Related Posts

  • SuryaSurya
  • October 27, 2026
  • 588 views
66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

Read more

  • SuryaSurya
  • October 27, 2026
  • 168 views
ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌