విజ‌య‌వాడ ఉత్స‌వ్ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు

అంద‌జేసిన ఎంపీ కేశినేని చిన్ని

అమ‌రావతిటుడే ప్ర‌తినిధి : సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, కేశినేని ఫౌండేషన్, జిజ్ఞాస ఆర్ట్స్ వర్క్స్ సంయుక్తంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గురువారం రామవరప్పాడు రింగ్ వద్ద సర్వీసు రోడ్ లో ఉన్న ఎం కన్వెన్షన్ లో బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొని, వివిధ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా మొత్తం ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రతిభావంతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారిని ఎంపీ కేశినేని చిన్ని అభినందించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ..విజయవాడ నగరంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, విద్యార్థులు, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా వివిధ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి, సొసైటీ ఫర్ వైబ్రేoట్ విజయవాడ సభ్యులు విజయవాడ ఉత్సవ్ సభ్యులు జిజ్ఞాస ఆర్ట్ వర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Views: 112

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌