అమరావతి టుడేప్రతినిధి:
66వ డివిజన్ జనసేన అభ్యర్ధిగా మట్ల రవి అభ్యర్ధిత్వం ఖరారయ్యింది. ఇక్కడ సీటు కోసం జరిగిన పోరులో ఆయన తన పనితీరుతో అధిస్ధానంను మెప్పించి బీ ఫారం అందుకున్నారు. మట్ల రవికి కార్పొరేటర్ అభ్యర్ధిత్వం ఖరారు లాంఛన ప్రాయమేనని అమరావతి టుడే గత నెల 28వతేదీన కధనం ప్రచురించింది. ఇక్కడ కార్పొరేటర్ సీటు జనసేనకు కేటాయించటంతో టీడీపీ నుంచి జనసేనలో చేరిన ఆయన సీటు కైవసం చేసుకున్నారు. బుధవారం బీ పారంను రిటర్నింగ్ అధికారికి అందజేసిన రవి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం దూకుడు పెంచారు. సమయం తక్కువగా ఉండటంతో ఒక వైపు ప్రచారం నిర్వహించటంతో పాటు మరోపక్క రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసొసియోషన్ నేతలతో భేటీ అవుతున్నారు. తక్కిన పార్టీల కన్నా రవి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి
తనకు డివిజన్‌లో ప్రతీ సమస్యలు తెలుసునని కావున తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యల పరిస్కారమే పరమావధిగా పనిచేస్తానని మట్ల రవి హామీ ఇస్తున్నారు. ఒకప్పుడూ కనీస మౌలిక సదుపాయాలు లేని వినాయకనగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో రవి ఉంటున్నారు. వినాయకనగర్, దావు బుచ్చయ్యకాలనీ, జీవీఆర్‌నగర్‌తో పాటు బుడమేరు మద్యకట్టలో రవికి మంచి పట్టు ఉంది. ఇప్పటికే పలువురు రెసిడెన్సియల్ వెల్పేర్ అసోసియోషన్ నాయకులు, పలు పార్టీలకు చెందిన నేతలు రవిని కలిసి సంఘీభావం తెలుపుతున్నారు.
అపూర్వ స్పందన
వినాయకనగర్‌లో మౌలిక సదుపాయాలు, సమస్యల పరిస్కారానికి కృషి చేసిన మట్ల రవికి ఎన్నికల ప్రచారంలో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. కార్పొరేటర్‌గా ఎన్నికయ్యితే తమ ప్రాంతం వినాయకనగర్ మాదిరిగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జీవీఆర్‌నగర్, దావు బుచ్చయ్యకాలనీ కన్నా వెనుకబడిన వినాయకనగర్‌ను రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసొసియోషన్ అధ్యక్షుడిగా మట్ల రవి పార్టీలకు అతీతంగా పనిచేసి అభివృద్ధి పధంలో నిలిపారు.
ఎన్నిక లాంఛనమే
ఇక్కడ మట్ల రవి ఎన్నిక లాంఛనమేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివాద రహితుడు, ప్రజల సమస్యలపై మంచి అవగాహన ఉన్న స్ధానికుడు రవికి తాము అండగా నిలిచి గెలిపిస్తామంటూ యువత అంటన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటికీ స్ధానికత అండతో మట్ల రవి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
Views: 714








