– నాలుగు మండలా
లకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా
– ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి టుడే ప్రతినిధి : విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొం
డూరులో రూ.94.97 కోట్లతో ఏపీ ట్రాన్స్‌కో నిర్మించిన 220/132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సబ్ స్టేషన్‌తో ఎ.కొండూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, తిరువూరు మండలాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా ఎ.కొండూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ ఎదురయ్యే లో-వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధిక సామర్థ్యంతో ఎ.కొండూరు సబ్ స్టేషన్‌ను నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరాను విస్తరించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
Views: 140







